6 రెట్లు పెరిగిన దేశీయ రక్షణ ఎగుమతులు.. ప్రభుత్వం

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం నుంచి ఆయుధాల ఎగుమతులు పెరిగినట్లు రక్షణ..telugu latest news

Update: 2022-03-26 09:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం నుంచి ఆయుధాల ఎగుమతులు పెరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత ఆయుధాల ఎగుమతుల విలువ 2014 నుంచి సుమారు ఆరు రెట్లు పెరిగిందని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.11,607 కోట్లుగా నమోదైందని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతుల విలువ రూ.1,941 కోట్ల నుంచి రూ.11,607 కోట్లకు పెరిగిందని లోక్‌సభలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. రక్షణ ఎగుమతులను పెంచడానికి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వం 2025 నాటికి దాదాపు రూ. 36,500 కోట్ల వార్షిక ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఎగుమతి చేయడానికి భారత్ $375 మిలియన్ల (రూ. 2,770 కోట్లు) ఒప్పందం చేసుకుంది. బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ ఎగుమతి కోసం భారతదేశం ప్రస్తుతం సౌదీ అరేబియా, యుఎఇ తో సహా ఇతర దేశాలతో చర్చలు జరుపుతోంది.

Tags:    

Similar News