అచ్చంపేటలో చిన్న జీయర్ చిత్రపటం దగ్ధం.. ఆ ప్రాంతాన్ని ముట్టడిస్తామని వార్నింగ్
దిశ, అచ్చంపేట: గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో..Acchampeta Tribals hits out at Chinna Jeeyar
దిశ, అచ్చంపేట: గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గిరిజన దేవతలను అవమానపరుస్తూ మాట్లాడిన చిన్న జీయర్ స్వామి చిత్రపటాన్ని అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. శంకర్ నాయక్, సేవా సంఘం అచ్చం పేట తాలూకా అధ్యక్షుడు గోపాల్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు బిచ్య నాయక్, జెడ్పీటీసీ మంత్రి నాయక్, గిరిజన ఉద్యోగులు కృష్ణ తదితరులు మాట్లాడుతూ... చిన్న జీయర్ స్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రామాంజనేయ చార్యుల పేరుతో సమతా మూర్తి విగ్రహం చూడటానికి సాధారణ మానవునికి రూ.150 రూపాయల టికెట్ ధర పెట్టి అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నది చిన్న జీయర్ స్వామి కాదా అని ప్రశ్నించారు.
చిన్న జీయర్ స్వామి ఆంధ్రా నుంచి తెలంగాణ కొచ్చి వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించి ఈ ప్రాంత ప్రజలను అవమాన పరుస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే రామాంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రాంతాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందు నాయక్, బలరాం, ఆర్ చందు ,చందు నాయక్, శ్రీరామ్, లక్ష్మణ్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.