దిశ, శేరిలింగంపల్లి: ప్రతి రోజూ ఏసీబీ ఎందరో అవినీతి అధికారులను పట్టుకొని అదుపులోకి తీసుకుంటోంది. అయినప్పటికీ కొందరు అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. అలాంటి ఇద్దరి అధికారులకు తాజాగా ఏసీబీ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. అపార్ట్మెంట్ విద్యుత్ కనెక్షన్ కోసం వినియోగదారుడి వద్ద లంచం తీసుకుంటూ ఇద్దరు విద్యుత్ శాఖ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. మాదాపూర్ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, లైన్మెన్ సతీష్ కుమార్ శనివారం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. అతడిని అధికారులు తక్షణమే అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.