వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేయండి : నీరజ్ కుమార్

వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఏకో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి

Update: 2024-12-19 09:02 GMT

దిశ, వాంకిడి : వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఏకో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని డీఎఫ్ వో నీరజ్ కుమార్ నేషనల్ హైవే అధికారులకు కోరారు. గురువారం మండలంలోని గోయగాం గ్రామ శివారులో నిర్మించిన ఏకో బ్రిడ్జిని నేషనల్ హైవే అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఏకో బ్రిడ్జి పై నిర్మాణానికి అనుగుణంగా ఎత్తు లేకపోవడంతో వన్యప్రాణుల రాకపోకలకు అనువుగా లేదని, ఏకో బ్రిడ్జి పై నిర్మాణానికి సమానంగా గుంతలు లేకుండా పనులు తొందరగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆయన కోరారు.


Similar News