ఎంఈవో కార్యాలయం తెరిచే దెవరు..?
మండలంలోని ఎంఈవో కార్యాలయం గత కొన్ని రోజుల
దిశ, వాంకిడి : మండలంలోని ఎంఈవో కార్యాలయం గత కొన్ని రోజుల నుంచి తాళం తెరవడం లేదు. కార్యాలయంలో పనిచేసే సమగ్ర శిక్ష ఉద్యోగులతో పాటు కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ సమ్మె పాల్గొంటున్నారు. ఇక ఉన్న ఒక ఇన్చార్జి ఎంఈవో పీజీ హెచ్ఎం కావడంతో తన పాఠశాలకు విధులు నిర్వహించేందుకు వెళ్తున్నారు. దీంతో ఎంఈవో కార్యాలయం తెరిచేవారు కరువయ్యారు. కార్యాలయానికి వివిధ పనులకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.