సంఘవిద్రోహ శక్తులు దూరంగా ఉండండి : ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు

సంఘవిద్రశక్తులకు యువత దూరంగా ఉండాలని కొమురం

Update: 2024-12-19 12:02 GMT

దిశ, బెజ్జూర్ : సంఘవిద్రశక్తులకు యువత దూరంగా ఉండాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డివి ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం మండల నాగ పెళ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో యువత పెడదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం రెండు షీ టీంలు పని చేస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బెజ్జూర్ మండలంలోని మారుమూల మొగవెల్లి నుంచి గూడెం రోడ్డు మరమత్తులు పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఏ ఒక్కరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని తెలిపారు.అనంతరం నాగ పెళ్లి గ్రామంలో 100 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పోలీస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ రామానుజన్ ,కౌటాల సీఐ ముత్యం రమేష్ , బెజ్జూర్ ఎస్సై ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News