హెచ్‌ఐవీ వ్యక్తితో జీవనం : లైఫ్, మెంటల్ హెల్త్ ఎలా కాపాడుకోవాలి?

దిశ, ఫీచర్స్ : ఏ రోగికైనా సంరక్షకులుగా వ్యవహరించడం సులభమైన విషయం కాదు.

Update: 2022-07-21 09:15 GMT

దిశ, ఫీచర్స్ : ఏ రోగికైనా సంరక్షకులుగా వ్యవహరించడం సులభమైన విషయం కాదు. ఇలాంటి వారు మానసిక ఒత్తిడి, చిరాకు, అలసట, నిరాశ, ఆందోళనతో పాటు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ లక్షణాలను ఎదుర్కొంటూ కొన్నిసార్లు రోగి కంటే ఎక్కువగా బాధపడతారు. ఇక అదనపు సంరక్షణ, పర్యవేక్షణ అవసరమయ్యే హెచ్‌ఐవీ సోకిన వ్యక్తితో నివసించేవారిలో అనేక మెంటల్ హెల్త్ ఇష్యూస్ తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సంరక్షకుల్లో ఎక్కువ మంది మహిళలే ఉంటుండగా.. శారీరక, లైంగిక వేధింపులు సహా అన్ని వర్గాల నుంచి అంతర్గతంగా ఉన్న కళంకాన్ని కూడా ఎదుర్కొంటున్నారు.

ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 మిలియన్ ప్రజలు హెచ్‌ఐవీ బారిన పడ్డారు. వారికి 17 మిలియన్ల మంది సంరక్షకులుగా ఉన్నారు. హెచ్‌ఐవీ రోగుల మహిళా సహాయకులు కూడా రోగి వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులనే కలిగి ఉంటారు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధుల చరిత్ర కలిగి ఉన్నపుడు కండోమ్‌ ఉపయోగించకూడదని వారి భాగస్వామి పట్టుబడితే హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఉండటంతో వారు మానసిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

సంరక్షకుని డిప్రెషన్ లక్షణాలు ఏమిటి?

* విచారం, ఆత్రుత లేదా నిస్సహాయత

* బరువు పెరగడం లేదా తగ్గడం

* ఎక్కువ నిద్రపోవడం లేదా నిద్రలేమి

* స్థిమితంగా ఉండలేకపోవడం

* దేనిపైనా ఆసక్తి, ఏకాగ్రత లేకపోవడం

* తరచూ అలసట

* విలువలేని ఫీలింగ్

* అపరాధభావం

* ఆత్మహత్య భావనలు

మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలి?

* HIV పరీక్ష చేయించుకుని పాజిటివ్‌గా నిర్ధారణ అయితే సరైన చికిత్స తీసుకోవాలి.

* మీతో పాటు రోగి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

* సంబంధిత సపోర్ట్ గ్రూప్‌లో చేరాలి.

* కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలి.

* HIV గురించి మరింత తెలుసుకుని.. చికిత్స ప్రణాళికలు, తాజా అప్‌డేట్స్ పాటించాలి.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు వాకింగ్, యోగా, గార్డెనింగ్ ఉత్తమంగా పనిచేస్తాయి.

* బాడీ రీచార్జ్ కోసం సరైన పోషకాహారం అందించేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలి.

Tags:    

Similar News