Jharkhand Election Results: ఝార్ఖండ్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. క్షణక్షణం మారుతోన్న ట్రెండ్స్

ఝార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Election Results) క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి.

Update: 2024-11-23 04:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Election Results) క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్‌ను నిర్వహించారు. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, నవంబర్ 20న రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ (Magic Figure) 40 సీట్లు కాగా.. ఎన్డీఏ కూటమి (NDA Alliance), ఇండియా కూటమి (INDIA Alliance) మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) 30 స్థానాల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి (India Alliance) 25 స్థానాల్లో ముందంజలో ఉంది. గండే నియోజకర్గం నుంచి సీఎం హేమంత్‌ సోరెన్‌ (Hemanth Soren) భార్య కల్పనా సోరెన్‌ (Kalpana Soren) స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ధన్వార్‌లో ఝార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి (Babulal Marandi), సరాయ్‌కెలాలో ఝార్ఖండ్ మాజీ సీఎం చంపయీ సోరెన్‌ (Champai Soren), ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పాటిల్‌ (Jayanth Patil) ఆధిక్యంలో ఉన్నారు.

Tags:    

Similar News