Jharkhand: ఇవి ప్రారంభ పోకడలు మాత్రమే.. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత
ఇవి ప్రారంభ పోకడలు మాత్రమేనని జార్ఖండ్ కాంగ్రెస్ నేత(Congress Leader) రాజేష్ ఠాకూర్(Rajesh Thakur) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: ఇవి ప్రారంభ పోకడలు మాత్రమేనని జార్ఖండ్ కాంగ్రెస్ నేత(Congress Leader) రాజేష్ ఠాకూర్(Rajesh Thakur) అన్నారు. ఇటీవల జరిగిన జార్ఖండ్(Jharkhand), మహారాష్ట్ర(Maharastra) ఎన్నికల ఫలితాలు(Election Results) నేడు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలపై దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వైపు చూపించినా.. అవి తప్పు అని నిరూపిస్తామని ఇండియా కూటమి(India Alience) నేతలు అంటున్నారు. అయితే ఇప్పటివరకు తెలిసిన ఫలితాల ప్రకారం రెండు రాష్ట్రాల్లోను ఎన్డీఏ(NDA) ముందంజలో ఉంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాజేష్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఎన్డీయే తొలి ట్రెండ్‌లో దూసుకుపోతుందని అన్నారు. అయితే "ఇవి ప్రారంభ పోకడలు మాత్రమేనని, మీడియా సంస్థలు వారికి లీడ్ చూపించినా, మాకు చూపించినా.. అవి సందర్భోచితమైనవి కాదని స్పష్టం చేశారు. కానీ, ముందు పోకడలు జార్ఖండ్‌లో కాంగ్రెస్ విజయం వైపు పయనిస్తున్నట్లు సూచిస్తున్నాయని తెలిపారు. అలాగే మేము ప్రచారం చేసిన విధానం.. చేసిన పనితో పాటు మా అభిప్రాయాలను ప్రజల ముందు ఉంచామని, దీంతో తాము కోరుకున్న ఫలితాలను పొందగలమని ఆశిస్తున్నట్లు రాజేష్ ఠాకూర్ పేర్కొన్నారు.