Allu Ayaan: అయాన్ & అర్హ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? క్యూట్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ కుమారుడు అయాన్.. కుమార్తె అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-11-22 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్(Allu Arjun) కుమారుడు అయాన్(Aayan).. కుమార్తె అర్హ(arha)  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు బన్నీ సతీమణి స్నేహారెడ్డి(Snehareddy) సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇకపోతే ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్ అండ్ పిల్లలు అయాన్, అర్హ బాలకృష్ణ వ్యాఖ్యాతగా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అన్‌స్టాపబుల్ షో పార్ట్-2 (The Unstoppable Show Part-2) విడుదల చేశారు. షోలో బాలయ్య పిల్లలకు పొడుపు కథలు వేస్తూ తెగ సంగడి చేశారు. చిన్న తప్పు లేకుండా అర్హ తెలుగు పద్యం చెప్పి నెటిజన్లను ఆశ్యర్యపరిచింది. బాలకృష్ణ పిల్లలతో సరదాగా ఉండి.. ఫన్నీ ఫన్నీ ప్రశ్నలు అడిగారు.

ఈ క్రమంలో బాలయ్య పిల్లల్ని మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు. అయాన్ బదులిస్తూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అంటే ఇష్టమని తెలిపాడు. యాక్షన్‌లో రెబల్ స్టార్(Rebel Star) సూపర్ అని అన్నాడు. ఇక డ్యాన్స్ పరంగా అయితే టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తాత ఇష్టమని వెల్లడించాడు. బహుబలి చిత్రం అయాన్ ఫేవరెట్ మూవీ అని అన్నాడు. ఇక అర్హ మాత్రం నేను శకుంతలంలో అబ్బాయిగా నటించానని.. అదే నా ఫేవరేట్ అని చెప్పింది. అలాగే అల్లు అయాన్ తన ఫేవరేట్ దర్శకుడు బోయపాటి శ్రీను అని తెలిపాడు.


Similar News