నటుడిగా మారిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. ‘భైరవం’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భైరవం’.

Update: 2024-11-22 09:16 GMT

దిశ, సినిమా: డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భైరవం’. ఇందులో టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్(Nara Rohit), మంచు మనోజ్ (Manchu Manoj)నటిస్తున్నారు. ఇప్పటికే వీరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. దీంతో అదే ఫామ్‌తో ‘భైరవం’(Bhairavam) మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా, ‘భైరవం’ చిత్రం అప్డేట్ విడుదల చేశారు మేకర్స్.

ఇందులో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన పులి రవీంద్ర(Puli Ravindra) పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్‌ను నెట్టింట పెట్టారు. ఇదే పోస్టర్‌ను సందీప్ రాజ్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘నన్ను నెగిటివ్ పాత్రలో చూడాలని 10 ఏళ్ల కల నిజమైంది.

నన్ను ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం చేసినందుకు ధన్యవాదాలు. 2025 అన్ని అంశాలలో గొప్పగా ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ సందీప్ రాజ్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, సందీప్ రాజ్ ‘కలర్ ఫోటో’ సినిమాతో భారీ సక్సెస్ సాధించారు. కలర్ ఫోటోతో జాతీయ స్థాయిలో తన సత్తా చాటుకున్నాడు. సందీప్‌ రాజ్‌ ఇప్పుడు నటుడిగా కూడా మారారు.


Click Here For Twitter Post..

Tags:    

Similar News