ఆప్ అధ్యక్షుడిపై దాడి చేసిన మైనర్లు.. నిరసన చేసి వస్తుండగా..
దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై ముగ్గురు మైనర్లు దాడికి పాల్పడ్డారు. ఆప్ సోషల్ జస్టిస్ వింగ్ అధ్యక్షుడు
దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై ముగ్గురు మైనర్లు దాడికి పాల్పడ్డారు. ఆప్ సోషల్ జస్టిస్ వింగ్ అధ్యక్షుడు యశ్వంత్ శ్రీమంత్ కాంబ్లేపై పింప్రి చించ్వడ్‌లో దాడులు జరిగియి. ఈ ఘటన పూణెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యశ్వంత్ శనివారం ఓ నిరసనలో పాల్గొని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో అతడిపై ముగ్గురు మైనర్లు వెనుక నుంచి దాడి చేశారు. వెనుక నుంచి బైక్‌పై వస్తున్న మైనర్లు పదునైన కత్తిలాంటి ఆయుధంతో యశ్వంత్ తలపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అది గమనించిన చుట్టుపక్కల వారు యశ్వంత్‌ను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మైనర్లు బహుశా కత్తిని వాడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు యశ్వంత్ భోసరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్టేషన్ ఇన్‌చార్జి భాస్కర్ జాదవ్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారంతా మైనర్లని, ఈ దాడి వెనుక రాజకీయ కక్షలు ఉండి ఉండవచ్చని అన్నారు.