Tollywood: స్టార్ డైరెక్టర్లకి సవాల్ విసురుతున్న చిన్న సినిమా
ఈ లవ్ స్టోరీలన్నింటికీ ఒక్కటే గోల్ ఉంటుంది
దిశ, వెబ్ డెస్క్ : ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రేమ కథలతో వచ్చిన సినిమాలని చూసాము. కానీ, ఇప్పుడు చెప్పబోయే సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు. పిసి క్రియేషన్స్ సమర్పణలో మనూటైమ్ మూవీ మిషన్ బ్యానర్లో ‘YO! 10 ప్రేమకథలు’ ( Yo Ten Love Stories ) కొత్త మూవీ రాబోతుంది. ఈ సినిమానకి నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా, ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం జరగగా డైరెక్టర్ వీరశంకర్, చంద్రమహేశ్ గెస్టులుగా హాజరయ్యారు. అయితే, ఈ మూవీలో పది జంటలు, పది ప్రేమ కథలు ఉండబోతున్నాయట. డైరెక్టర్ మనోహర్ చిమ్మని మాట్లాడుతూ.. " యో అనే మాట యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఇప్పటి యూత్ ఆలోచనల చుట్టూ తిరిగే 10 ప్రేమ కథలు మీ ముందుకు అతి త్వరలో రానుంది. 2 గంటల నిడివి ఉండే ఈ మూవీలో 10 జంటలు, 10 ప్రేమ కథలు, ఒక్కో ప్రేమకథ ఒక్కో జానర్ లో తీశాను. ఈ లవ్ స్టోరీలన్నింటికీ ఒక్కటే గోల్ ఉంటుంది. ఆ పాయింట్ యూత్ కి కనెక్ట్ అవుతుంది. దీనిలో నటించే వాళ్ళ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాము. సినిమా షూటింగ్ నవంబర్ నుంచి స్టార్ట్ అవ్వనుందని, కొన్ని సీన్స్ లో AI ని ఉపయోగిస్తున్నామని" తన మాటల్లో చెప్పుకొచ్చాడు.