అరుదైన ఘటన.. కెన్యాలో జన్మించిన కవల జిరాఫీలు
దిశ, వెబ్‌డెస్క్: కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జంట(కవలలు) జిరాఫీలు జన్మించాయని కెన్యా వైల్డ్‌లైఫ్ అండ్
దిశ, వెబ్‌డెస్క్: కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జంట(కవలలు) జిరాఫీలు జన్మించాయని కెన్యా వైల్డ్‌లైఫ్ అండ్ టూరిజం క్యాబినెట్ సెక్రటరీ నజీబ్ బలాలా ప్రకటించారు. దీనికి వారు.. "మాసాయి జిరాఫీలలో ఒకటి కవలలకు జన్మనిచ్చింది, ఇది అరుదైన సంఘటన. నవజాత శిశువులను మేము ప్రేమతో స్వాగతిస్తున్నాం" అని నజీబ్ బలాలా ట్వీట్ చేశారు. అయితే సాధారణంగా ఏ జిరాఫీకి కూడా.. కవల పిల్లలు జన్మించవు. ఎందుకంటే వాటి శరీర నిర్మాణం కారణంగా..అవి ఒకటి కంటే ఎక్కువ పిల్లల్ని కనలేవు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జిరాపీలలో కవలల రేటు ప్రతి 2,80,000 జిరాఫీలలో ఒకటి మాత్రమే ఇలా కవలలకు జన్మనిస్తుంది తెలిపారు.