సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు అన్నారు.
దిశ, దుండిగల్ : ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ శంభిపూర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో సంక్షేమ సంఘం సభ్యులు, స్థానిక నాయకులు కలిసి సమస్యలు పరిష్కరించాలని ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అందుకు స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తానన్నారు.
చిత్తారమ్మ జాతరకు ఆహ్వానం
గాజులరామారం డివిజన్ లో ఈ19న జరిగే చిత్తారమ్మ దేవి జాతరకు రావాలంటూ ఆలయ కమిటీ సభ్యులు శంభిపూర్ రాజును ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, అనంత స్వామి, బీఆర్ఎస్ నాయకులు భీమ్ సింగ్ నాయక్, జగన్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నల్టూరి కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, చిత్తారమ్మ కమిటీ అధ్యక్షుడు కూన అంతయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.