అతనికి అలా అయ్యిందని అందరూ గుండు చేయించుకున్నారు..! వైరల్ వీడియో
కాస్త కష్టమైనా ముందడుగే వేస్తాము. A group of friends shave their heads in solidarity with a friend battling cancer.
దిశ, వెబ్డెస్క్ః కొన్ని బంధాలు అనుభవంలో తప్ప మాటల్లో నిర్వచించలేము. ముఖ్యంగా స్నేహాన్ని.. ఏదీ ఆశించకుండా కేవలం ఫ్రెండ్ అనే భావనలో ఏ స్థాయికైనా వెళ్లి స్నేహితులకు తోడ్పడుతుంటాము. స్నేహితుడి మొహంలో ఆనందం చూడటానికి కాస్త కష్టమైనా ముందడుగే వేస్తాము. వీళ్లు కూడా ఇలాగే చేశారు. క్యాన్సర్తో పోరాడుతున్న తమ బెస్టి కోసం ఫ్రెండ్స్ అంతా కలిసి మనసును హత్తుకునే పని చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో క్యాన్సర్ చికిత్స ప్రారంభించిన తమ స్నేహితుడికి మద్దతుగా గుండు చేయించుకున్న ఫ్రెండ్ సర్కిల్ కనిపిస్తుంది. గంతులు వేస్తూ సందడి చేసిన వీళ్లంతా తమ స్నేహితుణ్ణి ఉత్సాహపరుస్తుంటారు. దాదాపు కన్నీళ్లు తెప్పించే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు తన స్నేహితుడి కోసం ఎలా గుండు చేయించుకున్నారో కూడా చూపించారు. గుడ్న్యూస్ మూవ్మెంట్ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. 'స్నేహమంటే ఇదేరా..' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.