ఆయనపై కేసు నమోదు.. ఆందోళనకారులకు నచ్చచెప్పకుండా ఈడ్చుకెళ్తున్నారు..
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం నగరం 59 వ- A case has been registered against former corporator Jangam Bhaskar at Khammam Rural Police Station
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం నగరం 59 వ డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడైన జంగం భాస్కర్ పై గురువారం రాత్రి రూరల్‌పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తుమ్మల అనుచరులు.. భాస్కర్భార్య కల్పనతో కలిసి రూరల్ పోలీస్స్టేషన్ముందు జంగం భాస్కర్‌పై అక్రమంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఎక్కడికో తరలించారని వెంటనే విడుదల చేయాలని, నా భర్త అడ్రస్ చెప్పాలంటూ ఆందోళన చేపట్టారు.
ఇంతలో రూరల్ఏసీపీ బస్వారెడ్డి వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పకుండా.. వారిపై విరుచుకు పడటంతో పాటు.. టీఆర్ఎస్నాయకుడు జొన్నలగడ్డ రవి, భాస్కర్భార్య కల్పనలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. మద్దతుదారులు ఏకమై అక్రమ అరెస్టులను ఖండించాలని నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.
అసలేం జరిగింది..
ఖమ్మం రూరల్‌పోలీస్‌స్టేషన్‌లో జంగం భాస్కర్ పై బెదిరింపుల కేసు నమోదైంది. భాస్కర్రూరల్మండలం నాయడుపేటకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు.. మేకల ఉదయ్‌కు ఫోన్‌చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించినట్లు రూరల్‌పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు జంగం భాస్కర్ పై కేసు నమోదు చేసేందుకు మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిపించారు.
భాస్కర్‌ను రాత్రి అయిన బయటకు పంపక పోయేసరికి తుమ్మల అనుచరులైన తమ్మినేని క్రిష్ణయ్య, జొన్నలగడ్డ రవి, బండి జగదీశ్, శాఖమూరి రమేష్ లు స్టేషన్‌కు వచ్చి పోలీసులతో మాట్లాడి వెళ్లారు. ఈ లోపు భాస్కర్మాయమైనట్లు, పోలీసులే ఎక్కడికో తరలించారని వార్త బయటకు రావడంతో స్టేషన్‌కు అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
40 మంది తుమ్మల మద్ధతుదారులపై కేసు నమోదు..
ఇది ఇలా ఉండగా గురువారం అర్ధరాత్రి ఆందోళన చేపట్టిన సంఘటనలో తుమ్మల వర్గానికి చెందిన 40 మంది టీఆర్ఎస్నాయకులపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులను దుర్భాషలాడారని తదితర అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు.