Kerala Floods: కేరళలో వరదల బీభత్సం.. ఏడుగురు మృతి

7 Were died Due to heavy floods in Kerala| కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుని ఏడుగురు మరణించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి

Update: 2022-08-02 09:35 GMT

దిశ,వెబ్‌డెస్క్: 7 Were died Due to heavy floods in Kerala| కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుని ఏడుగురు మరణించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా మరికొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో అనేక చోట్ల రిజర్వాయర్లు, నదులు, నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు కేరళ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్ మరియు త్రిస్సూర్‌లలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎర్నాకుళం, కొట్టాయం, కొల్లం మరియు మలప్పురంలో మరో నాలుగు బృందాలను మోహరించనున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని ప్రభుత్వ అధికారులకు కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు.  

ఇది కూడా చదవండి: `నేను గెలిస్తే పార్టీ మధ్య వారధి నిర్మిస్తా`: మార్గరెట్ అల్వా

Tags:    

Similar News