Kabul Bomb Blast: పాఠశాలలో బాంబు పేలుళ్లు.. స్పష్టత రాని మరణాల సంఖ్య
కాబూల్: అప్ఘానిస్తాన్ పశ్చిమ కాబూల్ పాఠశాలలో పేలుళ్లు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ..Latest Telugu News
కాబూల్: Kabul Bomb Blast| అప్ఘానిస్తాన్ పశ్చిమ కాబూల్ పాఠశాలలో పేలుళ్లు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న మూడు బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 11 మంది గాయపడినట్లు వెల్లడించారు. చనిపోయిన వారంతా విద్యార్థులేనని చెప్పారు. అయితే మరణాల సంఖ్య పై ఇంకా అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. షియా వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సున్నీలు దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో షియాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 'ఓ హై స్కూల్‌లో మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. షియా వర్గానికి చెందిన వారు మరణించారు' అని కాబూల్ ప్రతినిధి ఖలీద్ జార్డాన్ తెలిపారు.
మరోవైపు ఆస్పత్రిలో నలుగురు మరణించారని, 14 మంది గాయపడినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనపై బాధ్యత వహిస్తున్నట్లు ఎవ్వరూ అధికార ప్రకటన చేయలేదు. మరోవైపు తాలిబన్లు దేశ భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.