ఐదేళ్ళ పాప పై అత్యాచారం.. ఫోన్ ఇస్తామంటూ..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బీబీ పేట మండల కేంద్రంలో శనివారం ఐదేళ్ళ
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బీబీ పేట మండల కేంద్రంలో శనివారం ఐదేళ్ళ పాప పై అత్యాచార ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. ఐదు సంవత్సరాల పాప ఆరుబయట ఆడుకుంటుండగా ఎదురింట్లో ఓ మహిళ కిరాయికి నివసిస్తుండగా ఆ మహిళ ఇంటికి బంధువుగా వచ్చిన నిజామాబాద్ జిల్లా దొంగల ధర్మారంకు చెందిన కామాంధుడు బాజ రవి (34) ఆరుబయట ఆడుకుంటున్న బాలికపై కన్నేశాడు.
అభంశుభం తెలియని ఆ పసికందుకు ఆడుకోవడానికి ఫోన్ ఇస్తానని మభ్యపెట్టి అమ్మాయిని తన బంధువుల ఇంటిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి బాలిక కోసం ఎదురింటిలోకి వెళ్లి చూడగా విషయం బయటకు వచ్చింది. విషయం ఆ నోటా ఈ నోటా పోలీసుల వరకు చేరగా ఆ కామాంధుడిపై బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలికను జిల్లా ఆస్పత్రికి పంపి ఆరోగ్యం నిలకడగా ఉంచే ప్రయత్నంగా పరీక్షల నిర్వహణకు పంపి చేసినట్లు స్థానిక ఎస్ఐ రాజారామ్ తెలియజేశారు. ఆ కామాంధుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామన్నారు.