33 ప్రభుత్వ పాఠశాలల్లో దర్యాప్తు.. అలా ఎలా చేశారని..

దిశ, వెబ్‌డెస్క్: 33 ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై దర్యాప్తు చేయాలని ఉన్నత విద్యాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు..

Update: 2022-07-15 09:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: 33 ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై దర్యాప్తు చేయాలని ఉన్నత విద్యాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 33 పాఠశాలల్లో ఆదివారానికి బదులుగా శుక్రవారాన్ని సెలవు రోజుగా పాటిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో ఉన్నతాధికారులు ఆయా పాఠశాలల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇది జార్ఖండ్‌లో డుమ్‌క ప్రాంతంలోని పాఠశాలల్లో జరుగుతోంది. దీనిపై అధికారులు స్పందిస్తూ సెలవు రోజును అలా ఎలా మారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయా పాఠశాలల్లో మరిన్ని విషయాలపై కూడా దర్యాప్తు చేయాల్సి ఉందని, ఇంకా చాలా అవకతవకలను గుర్తించామని ఓ అధికారి తెలిపారు. 'ప్రతి ప్రభుత్వ పాఠశాల పేరులో ఉర్దు పదం చేరింది. పాఠశాల పేరులో ఉర్దు పదం ఎలా వచ్చిందో కూడా దర్యాప్తు చేస్తున్నాం. దానికి తోడుగా ఆదివారం సెలవును శుక్రవారానికి మార్చారు. ఎలాంటి పరిస్థితుల్లో వారు ఇలాంటి మార్పులు చేశారో అన్న విషయంపై కూడా విచారణ జరుపుతున్నాం' అని అధికారి వెల్లడించారు.


Similar News