పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

దిశ, అడ్డాకుల: మండల పరిధిలోని పెద్దమునిగల్చెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో..30 students fall ill after eating School food

Update: 2022-03-09 14:13 GMT

దిశ, అడ్డాకుల: మండల పరిధిలోని పెద్దమునిగల్చెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో కళ్ళు తిరగడం.. అయ్యాయి. విద్యార్థులను స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రిలో పనిచేస్తున్న సీహెచ్ భాస్కరరావు ద్వారా తన కారులో మహబూబ్ నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే స్థానిక తహశీల్దార్ పిల్లలను పరిశీలించి తన కారులో జిల్లా ఆస్పత్రికి ఏడు మంది విద్యార్థులను తరలించారు. అనంతరం మిగిలిన 12 మంది కూడా అస్వస్థతకు గురికావడంతో మహబూబ్ నగర్ నుంచి వచ్చిన అంబులెన్స్ లో 12 మందిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇలా మొత్తం 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. కుళ్లిన గుడ్లు, పాడైన పెరుగు తినడం వల్ల ఇలా జరిగిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News