కోటపల్లిలో ఆ పని.. 28 మంది అరెస్ట్
దిశ, కోటపల్లి: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాణహిత పరివాహక అటవీ ప్రాంతంలో..28 poker players arrested in Kotapalli
దిశ, కోటపల్లి: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాణహిత పరివాహక అటవీ ప్రాంతంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై రామగుండం టాస్క్ ఫోర్స్, కోటపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో 28 మంది పందెంరాయుళ్లతోపాటు నాలుగు కోళ్లు, 5 కత్తులు,7 వాహనాలు, రూ. లక్షా 51 వేల నగదుతోపాటు 26 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందులో పట్టుబడినవారంతా పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందినవారు ఉన్నారన్నారు. ఈ పందెం రాయుళ్లు మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి స్థావరాలను ఎప్పటికప్పుడు మారుస్తూ పందాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ మహేందర్, ఎస్సై లచ్చన్న, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, రాకేష్, శ్యామ్ సుందర్, కోటపల్లి పోలీసులు పాల్గొన్నారు.