మాజీలకు భద్రత ఉపసంహరణ: ఆదేశాలు

ఛంఢీఘడ్: ప్రమాణస్వీకారం చెయ్యకముందే సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. latest telugu news..

Update: 2022-03-12 14:52 GMT

ఛంఢీఘడ్: ప్రమాణస్వీకారం చెయ్యకముందే సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 122 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వీవీఐపీలకు భద్రతా ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు లేఖ రాశారు. కేంద్రం సూచనల ప్రకారం బాదల్ కుటుంబం తప్ప మిగతా వారికి భద్రతను ఉపసంహరించాలని ఆదేశించారు. వారిలో మాజీ సీఎం అమరీందర్ సింగ్, చరణ్ జిత్ సింగ్ ఛన్నీ తో పాటు ఇతర నేతల భద్రతను ఎత్తివేశారు. 'ఒకవైపు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది లేకుండా ఖాళీగా ఉంటే, నేతల ఇంటి ముందు టెంట్ వేసి భద్రత కల్పించారు. మేము పోలీస్ స్టేషన్లను సిబ్బంది తో నింపుతాం. మూడున్నర కోట్ల రాష్ట్ర ప్రజల భద్రతే మాకు ముఖ్యం' అని అన్నారు. కాగా, మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 92 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News