సహాయకులకు రూ. 3.9 కోట్ల విలువైన షేర్లు కానుకగా ఇచ్చిన ఐడీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ!

Update: 2022-02-22 13:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు సీఈవో, ఎండీ వైద్యనాథన్ తన నిర్ణయంతో మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచారు. ఆయన వద్ద ఇంట్లో, ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి, డ్రైవర్, ట్రైనర్‌లకు 9 లక్షల షేర్ల(3.7 శాతం)ను కానుకగా ఇచ్చారు. వీటి విలువ దాదాపు రూ. 3.95 కోట్లు కావడం విశేషం. మొత్తం ఐదుగురికి వారి సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు ఈ షేర్లను సహాయంగా ఇచ్చినట్టు, వారెవరితోనూ ఆయనకు ఎలాంటి బంధుత్వం లేదని ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. కానుకగా ఇచ్చిన మొత్తం షేర్లలో ట్రైనర్‌గా ఉన్న రమేష్ రాజుకు 3 లక్షల షేర్లు, డ్రైవర్ అలగర్‌స్వామికి 2 లక్షలు, సహాయకులుగా ఉన్న ప్రాంజల్‌కు 2 లక్షలు, దీపక్, సంతోష్‌లకు చెరో లక్ష షేర్లను వైద్యనాథన్ కానుకగా అందజేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..