మేమే నెం.1 అంటున్న రాష్ట్రాలు.. హెచ్చరిస్తున్న మోడీ

దిశ,వెబ్ డెస్క్ : కోవిడ్ వ్యాక్సిన్ వృధా చేయడంలో తెలుగురాష్టాలు మొదటి స్థానంలో ఉండటం పై ప్రధాని మోడీ మండిపడ్డారు. ముఖ్యమంత్రులతో వర్చువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృధా ఎక్కువగా అవుతుందన్నారు. కోవాగ్జిన్ వయల్‌ను ఒకసారి తెరిస్తే 20 మందికి టీకా ఇవ్వొచ్చు. కానీ వయల్‌ తెరిచే సమయంలో 10 మందే ఉంటే సగం వృధా అయినట్లే. అందుకే సరిపడా ఉన్నప్పుడే కోవాగ్జిన్ వయల్‌ తెరవాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా […]

Update: 2021-03-17 23:47 GMT

దిశ,వెబ్ డెస్క్ : కోవిడ్ వ్యాక్సిన్ వృధా చేయడంలో తెలుగురాష్టాలు మొదటి స్థానంలో ఉండటం పై ప్రధాని మోడీ మండిపడ్డారు. ముఖ్యమంత్రులతో వర్చువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృధా ఎక్కువగా అవుతుందన్నారు. కోవాగ్జిన్ వయల్‌ను ఒకసారి తెరిస్తే 20 మందికి టీకా ఇవ్వొచ్చు. కానీ వయల్‌ తెరిచే సమయంలో 10 మందే ఉంటే సగం వృధా అయినట్లే. అందుకే సరిపడా ఉన్నప్పుడే కోవాగ్జిన్ వయల్‌ తెరవాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా జాగ్రత్తలు పాటించక పోవడం వలనే టీకా వృధా అయ్యిందన్నారు. జాతీయ స్థాయిలో టీకా వృధా 6.5 శాతం ఉంటే ఎపీ, తెలంగాణలో మాత్రం రెండు,మూడింతలు ఎక్కువగా ఉండడం కలవరపరుస్తోందన్నారు. అలానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 10శాతం కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ వృధా అవుతోందంటూ ప్రస్తావించిన మోడీ, వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని సూచించారు. టీకా వృధా చేయడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇలా టీకా వృధా చేయడం సరికాదని తెలుగురాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ క్లాస్ పీకారు.

Tags:    

Similar News