అరకు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ల దిగ్భ్రాంతి

దిశ, వెబ్‌డెస్క్: అరకులోయలో ఘోర ప్రమాదం జరిగి, ఘాట్‌రోడ్‌ ఐదో నెంబర్ మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. అందరూ హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. తాజాగా ఈ ప్రమాదంపై రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు స్పందించారు. ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచిపేసిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని […]

Update: 2021-02-12 13:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: అరకులోయలో ఘోర ప్రమాదం జరిగి, ఘాట్‌రోడ్‌ ఐదో నెంబర్ మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. అందరూ హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. తాజాగా ఈ ప్రమాదంపై రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు స్పందించారు. ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచిపేసిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్సను అందించాలని సంబంధిత అధికారులకు గవర్నర్ సూచించారు.

Tags:    

Similar News