మంత్రి కేటీఆర్‌పై వైఎస్ షర్మిల ఫిర్యాదు

మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయన పని చేస్తున్న శాఖపైనా వైఎస్పార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.

Update: 2023-05-05 08:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయన పని చేస్తున్న శాఖపైనా వైఎస్పార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యుడే మంత్రి కేటీఆరేనని ఆమె హైదరాబాద్ బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ను విచారించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పేపర్ లీక్ ఐటీ డిపార్ట్‌మెంట్ వైఫల్యమేనన్నారు. టీఎస్పీఎస్సీలో అంత ఈజీగా పేపర్ ఎలా లీక్ చేశారని ఆమె ప్రశ్నించారు. ఈ పేపర్ లీక్‌తో 35 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని షర్మిల మండిపడ్డారు. ఇక పేపర్ లీక్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్‌పై నమ్మకం లేదన్నారు. సిట్ దర్యాప్తు ప్రగతి భవన్ నుంచే నడుస్తోందని చెప్పారు. ప్రగతి భవన్ డైరెక్షన్‌లో ఎవరిని విచారించాలి.. ఎవరి పేర్లు చేర్చాలనేది జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. తాను నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తే ఆడబిడ్డ అని కూడా చూడకుండా జైల్లో పెట్టారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..