కేసీఆర్ నియంత పోకడకు ఇదే నిదర్శనం: YS Sharmila

టీఎస్పీఎస్సీ బోర్డును భ్రష్టు పట్టించింది చాలదన్నట్లు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం హడావిడిగా బలవంతపు పరీక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు.

Update: 2023-08-12 12:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డును భ్రష్టు పట్టించింది చాలదన్నట్లు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం హడావిడిగా బలవంతపు పరీక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గ్రూప్–2 పరీక్ష వాయిదాకు 5 లక్షల మంది అభ్యర్థులు పట్టుబడుతున్నా.. దొరకు నిద్ర మత్తు వదలడం లేదని విమర్శించారు. పరీక్షలు మరో 3 నెలలు వాయిదా వేయాలని ఎవరెంత మొత్తుకున్నా పట్టింపు లేనితనం కేసీఆర్ నియంత పోకడకు మరోసారి అద్దం పడుతుందని విమర్శించారు. తొమ్మిదేండ్లుగా ఉద్యోగాల భర్తీ పక్కన పెట్టి నిరుద్యోగులను ఉరికంభం ఎక్కించారని, ఇంటికో కొలువు ఇస్తానంటే నమ్మినందుకు తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చారన్నారు.

కొలువులు ఇయ్యండని రోడ్డు మీదికి వచ్చిన లక్షలాది మందిపై లాఠీచార్జి చేశారని, ప్రశ్నించిన నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయించారని నిలదీశారు. అంగట్లో ప్రశ్నాపత్రాలు అమ్ముకొని నిరుద్యోగుల కడుపుల్లో మట్టి కొట్టారన్నారు. ఇకనైనా దుర్మార్గపు ఆలోచన మానుకొని, నిరుద్యోగులు కోరుతున్నట్లు గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలని, నిరుద్యోగులతో చర్చించి క్రమపద్ధతి ప్రకారం పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే బంధిపోట్ల రాష్ట్ర సమితిని నిరుద్యోగులే బొంద పెడతారని, ప్రగతిభవన్ గడీలను బద్దలు కొట్టి రోడ్డుపైకి ఈడుస్తారని హెచ్చరించారు.

Tags:    

Similar News