Hydra: తప్పకుండా చర్యలు తీసుకుంటాం.. రంగనాథ్ హామీ
హైదరాబాద్ శివారులోని అమీన్‌పూర్(Ameenpur)లో హైడ్రా(Hydra) కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) పర్యటించారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారులోని అమీన్‌పూర్(Ameenpur)లో హైడ్రా(Hydra) కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) పర్యటించారు. పెద్ద చెరువు, కొత్త చెరువు, శంభునికుంటను మంగళవారం పరిశీలించారు. చెరువుల కబ్జాపై స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పద్మావతి, వెంకటరమణ కాలనీల్లో కబ్జాలు చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి(Katasani Ramabhupal Reddy)పై కంప్లైంట్ చేశారు. దీంతో ఇవాళ రంగనాథ్(Ranganath) పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడారు.
విచారణలో ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారణ అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణుల కమిటీ వేసి సర్వే చేయిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్ మహా నగరంలోని చెరువులు, స్థలాలు, పార్కులు కబ్జాకు గురి కాకుండా కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సంస్థకు చట్టబద్దత కల్పించింది.