Etela Rajendar : కాంగ్రెస్ ఉత్సవాలపై ఈటల రాజేందర్ సెటైర్లు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-19 14:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు వరంగల్(Warangal) లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajendar) సెటైర్లు వేశారు. హైద‌రాబాద్‌లోని బీజేపీ కార్యాల‌యంలో ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో విఫలమైనా ఉత్సవాలను చేసుకుంటున్నందుకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 'తెలంగాణ‌లో ఇచ్చిన హామీల చర్చపై రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నాను. నీ హామీల అమలుపై చర్చకు మోడీ ఎందుకు..? ఇక్కడ మేము ఉన్నాం. రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు మేము సిద్దంగా ఉన్నాం. నీ ఆరు గ్యారంటీలే కాదు 420 హామీలపై చర్చిద్దాం' అని ఈటల ప్రతి సవాల్ విసిరారు. 'ఒక వైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా ప్రభుత్వం ఉత్సవాలు చేసుకోవ‌డం కరెక్ట్ కాదు' అని మండిప‌డ్డారు. 'ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు. నిరుద్యోగ భృతి ఏమైంది..? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు..? కడుపు నొప్పి వ‌స్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుంది. హామీలు నెరవేర్చకుండా.. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. రేవంత్ రెడ్డి గాలిలో మేడలు కట్టడం కాదు, భూమి మీదకు వచ్చి మాట్లాడాలి' అంటూ రాజేంద‌ర్ విమ‌ర్శించారు.

Tags:    

Similar News