Harsha Sai: తెలంగాణ హైకోర్టుకు యూట్యూబర్ హర్షసాయి.. రిలీఫ్ లభించేనా?

యూట్యూబర్ హర్షసాయి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు నేడు విచారించనుంది.

Update: 2024-10-22 06:02 GMT

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబర్ హర్షసాయి (Youtuber Harsha Sai) పై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెల్సిందే. మహిళా నటి, నిర్మాత అయిన ఆమెను హర్షసాయి లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సెప్టెంబర్ 24న నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి హర్షసాయి, అతని ఫ్యామిలీ హైడ్ అయ్యారు. హర్షసాయి ఆచూకీ కోసం పోలీసులు గాలించగా.. ఎక్కడా కనిపించలేదు. దాంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. తాజాగా హర్షసాయి తెలంగాణ హైకోర్టు(Telangana Highcourt) ను ఆశ్రయించాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ (Narsingi Police Station) లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది.

ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్షసాయి, అతనిపై కేసుపెట్టిన యువతి ఒక పార్టీలో కలిశారు. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారగా.. హర్షసాయి తనను పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేశాడని యువతి కేసు పెట్టింది. తనపై లైంగిక దాడికి పాల్పడమే కాక.. ఏకాంతంగా ఉన్న సమయంలో రికార్డ్ చేసిన వీడియోలు, ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. ఇక్కడ మరో వెర్షన్ కూడా ప్రచారంలో ఉంది. మెగా హీరోకి సంబంధించిన ఓ సినిమా హక్కులు తనకు కావాలని, లేదంటే ఆ ఫోటోలను బయటపెడతానని హర్షసాయి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు తర్వాత సోషల్ మీడియా హర్షసాయిపై పెద్దఎత్తున దుమ్మెత్తి పోస్తోంది. 


Similar News