రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కేంద్రాల్లో సీఐడీ సోదాలు

ఏపీ వ్యాప్తంగా మద్యం తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణాల్లో సీఐడీ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది.

Update: 2024-10-22 08:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ వ్యాప్తంగా మద్యం తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణాల్లో సీఐడీ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. మద్యం అమ్మకాల్లో అవకతవకలపై ఆయా డిస్టిలరీస్‌లో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నంద్యాలలోని డిస్టిలరీస్‌లో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఐడీ ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సోదాల్లో డిస్టిలరీస్‌లో ఎంత మద్యం తయారు చేశారు? ఎంత విక్రయించారు..? ఎంత కొనుగోలు చేశారు? కొనుగోలుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉన్నాయా..? లేవా..? నిల్వల్లో ఏమైనా తేడా ఉందా..? అనే వివరాలతో పాటు కొనుగోలు లిస్ట్‌లను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవలే ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పాత ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే.. కొత్త ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి.. దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. టెండర్ల ప్రక్రియ ద్వారా మద్యం దుకాణాలను విక్రయించింది.


Similar News