హైదరాబాద్‌‌లో కొత్త కల్చర్.. యువతులతో అశ్లీల నృత్యాలు

హైదరాబాద్‌లో కొత్త కల్చర్ మొదలైంది. బంజారాహిల్స్‌లోని పలు పబ్‌లలో యువతుల చేత అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు.

Update: 2024-10-19 04:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కొత్త కల్చర్ మొదలైంది. బంజారాహిల్స్‌లోని పలు పబ్‌లలో యువతుల చేత అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. పక్కార్ సమాచారంతో శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. TOS పబ్‌లో యువతుల అశ్లీల నృత్యాలు చూసి ఖంగుతిన్నారు. పబ్‌లకు వచ్చే కస్టమర్లకు యువతులతో వల వేసి అధిక బిల్లు అయ్యేలా నిర్వహకులు ప్లాన్ విచారణలో తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 149 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 42 మంది యువతులు, ఏడుగురు నిర్వహకులు, 100 మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు హైదరాబాద్‌లో పబ్‌ల నిర్వహణపై పోలీసులు ఎన్ని మార్గదర్శకాలు ఇచ్చినా, పబ్‌ల నిర్వాహకులు గబ్బు పనులు మానడం లేదు. ఎక్కడ చూసినా పబ్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మద్యం, డ్రగ్స్, వ్యభిచారం ప్రధానంగా పబ్‌ల కేంద్రంగా సాగుతున్నట్లు సమాచారం. పోలీసులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా పబ్‌ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఇక సమాచారం అందిన వెంటనే అలాంటి పబ్‌లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.


Similar News