ఇన్‌స్టా రీల్ కోసం నడిరోడ్డు మీద యువతి వెర్రి చేష్టలు.. సజ్జనార్ రియాక్షన్ ఇదే! (వీడియో)
స్మార్ట్ ఫోన్‌ల ప్రభావం జనాల మీద మూములుగా లేదు. ఫుడ్ లేకపోయినా ఉంటారు కానీ, స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్‌ల ప్రభావం జనాల మీద మూములుగా లేదు. ఫుడ్ లేకపోయినా ఉంటారు కానీ, స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే రీల్స్ కోసం పడే పాట్లు మాత్రం వర్ణణాతీతం. ఎంతకైగా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతి ఇన్‌స్టా రీల్ కోసం నడిరోద్దుమీద ట్రాఫిక్ సిగ్నల్ పడ్డాక డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా.. దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనదంమో.. ఏమో!?’’ అని ట్విట్టర్ వేదికగా సజ్జనార్ అసహనానికి గురయ్యారు.
నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి… pic.twitter.com/RQ6aGEWUet
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 24, 2023