Yadagirigutta : యాదగిరిగుట్ట హుండీ ఆదాయం 5.35కోట్లు
యాదగిరిగుట్ట(Yadagirigutta Temple) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయం(Hundi income) 5కోట్ల 35లక్షల 41వేలు 432రూపాయలుగా వచ్చిందని దేవస్థానం ఈవో భాస్కర్ రావు వెల్లడించారు.
దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట(Yadagirigutta Temple) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీ ఆదాయం(Hundi income) 5కోట్ల 35లక్షల 41వేలు 432రూపాయలుగా వచ్చిందని దేవస్థానం ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. కొండ కింద సత్యనారాయణ వ్రత మండపం హాల్ రెండులో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మిశ్రమ బంగారం 215గ్రాములు, మిశ్రమ వెండి 7కిలోల 700గ్రాములు రావడం జరిగిందని తెలిపారు.
కాగా కార్తీక మాసం సత్యనారాయణ స్వామి వ్రతాలు 2023లో 20,524 జరుగగా, 2024లో 23,.248నిర్వహించినట్లుగా తెలిపారు.