Yadagirigutta :18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట బోర్డు : కొండా సురేఖ
దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో చర్చ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆలయ పాలక మండలి(Yadadri Temple Trust Board) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు(YTD Board) ఉంటుందని, వీరి పదవీ కాలం రెండు సంవత్సరాలుగా పేర్కొన్నారు. కాగా బోర్డు ఛైర్మన్ కు, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని, డీఏలు మాత్రం ఉంటాయని అన్నారు. ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి ఉంటారని వెల్లడించారు. బోర్డు బడ్జెట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని.. బోర్డు ఆధ్వర్యంలో, యాదగిరిగుట్టలో విద్యాసంస్థలను,ఆధ్యాత్మిక పాఠశాలలను నెలకొల్పి, నిర్వహించవచ్చునని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగిందన్నారు. గతంలో యాదగిరిగుట్టలో సాధారణ భక్తులకు సరైన సదుపాయాలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లు ఖర్చు చేసి వసతులు ఏర్పాటు చేసిందన్నారు. ఇంకా మంచి సౌకర్యాల కల్పనకు పాలకమండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసిందన్నారు. పాలకమండలి ఆధ్వర్యంలో యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణలో రూ.100 కోట్ల ఆదాయం వచ్చే అలయాలన్నీ దేవాదాయశాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయని సురేఖ పేర్కొన్నారు.