Yadagirigutta : యాదగిరి గుట్ట గోపురానికి వైభవంగా కళావరోహణ
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం దివ్య విమాన గోపురానికి కళావరోహణ కార్యక్రమాన్ని అర్చక పండితుల శాస్త్రయుక్తంగా వైభవంగా నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్: యాదగిరి గుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం దివ్య విమాన గోపురాని(Gopuram)నకి కళావరోహణ కార్యక్రమాన్ని అర్చక పండితుల శాస్త్రయుక్తంగా వైభవంగా నిర్వహించారు. విమాన గోపురం బంగారు తాపడం చేసేందుకు సంకల్పించి బుధవారం గోపురానికి కళావరోహణ కార్యక్రమమాన్ని దేవస్థాన ప్రధానార్చకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. విశేషంగా గోపుర సుదర్శన చక్రానికి నవ కలశ స్నపనం గావించి గోపురాన ఆవాహిత దేవతలందరినీ కలశము నందు ఆవాహన చేసుకున్నారు.
బంగారు తాపడం పూర్తి అయిన తర్వాత పునః కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేవస్ధాన కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అటు ప్రధానాలయంలో స్వామివారి నిత్యారాధనలు, అభిషేక పూజలు, నిత్య కల్యాణోత్సవాలు శాస్త్ర యుక్తంగా కొనసాగాయి. కార్తీక మాసం పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాలలో, దీపారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.