CM Chandrababu:ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ HICCలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రారంభించారు.

Update: 2025-01-03 13:07 GMT

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ HICCలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ఇవాళ(శుక్రవారం) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచమంతా అనేక రంగాల్లో తెలుగువారు రాణిస్తున్నారని పేర్కొన్నారు. అప్పట్లో ఐటీని ప్రోత్సహిస్తే నన్ను అవహేళన చేశారు.. కానీ ఇప్పుడు ఐటీ రంగం అద్భుతంగా పురోగమిస్తోంది అని తెలిపారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్(Hyderabad) అభివృద్ధిలో టీడీపీ పాత్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగడం ఇది రెండో సారి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రచయితలు, కవులు, తెలుగు అభిమానులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. రేపు(శనివారం) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఆదివారం ముగింపు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(TG CM Revanth Reddy) పాల్గొననున్నారు.

Tags:    

Similar News