'BRS MLA సంజయ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలి'

మహిళలపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వేధింపులకు చరమగీతం

Update: 2023-01-26 07:49 GMT

దిశ, మియాపూర్: మహిళలపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వేధింపులకు చరమగీతం పాడాలని, దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గూడ లావణ్య డిమాండ్ చేశారు. ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చిన మహిళలపై సొంత పార్టీ నాయకులు వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. గత మూడేళ్ల నుండి జగిత్యాల మున్సిపాలిటీలో చైర్మన్ శ్రావణి పట్టణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ పార్టీకి ప్రజలకు సేవ చేస్తున్నారు.

ఇది చూసి జీర్ణించుకోలేని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పూర్తి చేసిన పనులకు బిల్లులు రాకుండా ఆర్థికంగా కృంగిపోయి మనోవేధనకు గురయ్యే విధంగా ఎక్కడ మీటింగ్ జరిగిన ఒక మహిళ అని చూడకుండా ప్రజల ముందే కించపరుస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తన కుటుంబం అంతు చూస్తానని బెదిరించడం ఒక శాసనసభ్యునికి తగదని వారన్నారు. ఇలాంటి వారిపై వెనువెంటనే కేసీఆర్ స్పందించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజమంతా రాబోయే ఎన్నికల్లో ఇలాంటి నాయకులను పెంచి పోషించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

జాతీయ జెండా ఆవిష్కరణలో ఒకే ఒక్కడు

ఏఈపై అధికార పార్టీ ఎంపీపీ భర్త దురుసు ప్రవర్తన (వీడియో)

Tags:    

Similar News