కేసీఆర్ను మళ్లీ CM చేసే వరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా: MP రవిచంద్ర
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మళ్లీ సీఎం చేసేంత వరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మళ్లీ సీఎం చేసేంత వరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం ఎంపీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను రెండోసారి రాజ్యసభకు పంపించిన కేసీఆర్కు రుణపడి ఉంటానన్నారు. విభజన హామీలపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై పార్లమెంట్లో గళమెత్తుతానని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నాయకులు పాల్గొన్నారు.