రూ.59 సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు కొనసాగేనా..?

సెలవు రోజుల్లో మెట్రోరైల్లో రూ.59లకే రోజంతా ప్రయాణించే సూపర్‌ సేవర్‌ హాలిడే కార్డును భవిష్యత్తులో కొనసాగిస్తారో లేదోనన్న ఆందోళన మెట్రో ప్రయాణికుల్లో వినిపిస్తుంది

Update: 2024-09-23 10:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : సెలవు రోజుల్లో మెట్రోరైల్లో రూ.59లకే రోజంతా ప్రయాణించే సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డును భవిష్యత్తులో కొనసాగిస్తారో లేదోనన్న ఆందోళన మెట్రో ప్రయాణికుల్లో వినిపిస్తుంది. ఈ హాలిడే కార్డు ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో అందుబాటులో ఉండేది. 2022లో ప్రారంభించిన సూపర్ సేవర్ హాలిడే కార్డు పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. తరుచూ ఈ పథకాన్ని పొడిగించారు. గత మార్చి 31న మరో ఆరు నెలలు పొడిగించారు. అయితే ఈ నెలాఖరుతో ఈ పథకం ముగుస్తుంది. మరి ఈసారి కూడా ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు సంస్థ ఈ సూపర్ సేవర్ హాలిడే కార్డును పొడిగిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోసారి కూడా ఈ పథకాన్ని పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇటీవల మెట్రోలో ప్రయాణికుల సంఖ్య కోటిన్నరకు చేరింది. రెండు కోట్లకు చేరుకోవాలనేది మెట్రో లక్ష్యం. అందుకోసం మునుముందు కూడా సూపర్‌ సేవర్‌ హాలిడే కార్డు ఆఫర్‌ను పొడిగించడంతో పాటు ఉద్యోగులకు, విద్యార్థులకు నెలవారీ పాసులు, సూపర్‌ ఆఫ్ పీక్‌ అవర్‌ ఆఫర్లను ఇవ్వాలని, అలాగే ప్రయాణికుల రద్ధీ మేరకు బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణిలు డిమాండ్ చేస్తున్నారు.


Similar News