జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే మరిన్ని నిజాలు బయటకొస్తాయి.. కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసుల పిటిషన్

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Johnny Master)ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు(Narsinghi Police) రంగారెడ్డి జిల్లా కోర్టు(Ranga Reddy District Court)లో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-09-23 11:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Johnny Master)ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు(Narsinghi Police) రంగారెడ్డి జిల్లా కోర్టు(Ranga Reddy District Court)లో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే.. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, లైంగిక వేధింపులు, పోక్సో్ కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. గోవాలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. గోవాలోని ఓ లాడ్జీలో మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అక్కడి కోర్టులో హాజరుపరిచి.. హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్‌ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జానీపై పోక్సో కేసు(POCSO case) నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు ఈ పిటిషన్‌ను బదిలీ చేశారు. ఇవాళే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బెయిల్ కోసం జానీ మాస్టర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Read More : కోలీవుడ్ కంటే తెలుగు ఇండస్ట్రీ బెటర్.. జానీ మాస్టర్ కేసుపై చిన్మయి ఆసక్తికర పోస్ట్


Similar News