దేవుళ్లు, మతాల పేరుతో ఓట్లడగటమేంటి? : ఆకునూరి మురళి ఫైర్
దేవుళ్ళు, మతాలపేర్లతో ఓట్లు అడగడం ఇదేమి రాజకీయాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దేవుళ్ళు, మతాలపేర్లతో ఓట్లు అడగడం ఇదేమి రాజకీయాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ‘జై బజరంగబలి’ అనే నినాదం చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అభివృద్ధి చేసి ఓట్లు అడగాలి కదా అని నిలదీశారు. ఐదేళ్లలో14600 ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే పీఎమ్ శ్రీ కింద తీసుకుంటారా? అని ప్రశ్నించారు. మరి మిగిలిన 10 లక్షల ప్రభుత్వ బడులను ఎప్పుడు తీసుకుంటారన్నారు. కేంద్రం సగం పన్నులు తీసుకుంటున్నప్పుడు.. సగం ప్రభుత్వ బడులనైనా తీసుకోవాలి కదా అని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సూచించారు.