సమాచారం ఇవ్వడానికి భయమెందుకు? BRSపై ఆకునూరి మురళి ఫైర్
సమాచార కమిషన్‌ను బొంద పెట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆకునూరి మురళి ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సమాచార కమిషన్‌ను బొంద పెట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని మాజీ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఆరోపించారు. ప్రభుత్వం చేసే దొంగ పనులు ప్రజలు చూస్తారనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషనర్లను నియమించడం లేదని ధ్వజమెత్తారు. ఓ వైపు స.హ చట్టం కమిషనర్లను నియమించకుండా, మరో వైపు ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కమిషన్‌కు మంచి విశ్రాంత ఐఏఎస్, ఏపీఎస్, ఐఎఫ్ఎస్, ఏఐఎస్ అధికారులను కమిషనర్లుగా నియమించాలని సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరపున డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
Also Read..