టెన్త్ పేపర్ లీకేజ్‌లో బండి సంజయ్‌పై చర్యలు ఏవీ?

టెన్త్ పేపర్ లీకేజ్‌లో బండి సంజయ్‌పై చర్యలు ఏవీ..?

Update: 2023-09-07 17:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టెన్త్ పేపర్ లీకేజ్‌లో బండి సంజయ్‌పై చర్యలు ఏవీ..? అని ఎన్‌ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసలైన పేపర్ లీకేజీ దొంగలపై చర్యలు తీసుకోకుండా.. రైతు బిడ్డపై రాష్ట్ర ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుందన్నారు. హైకోర్టు చెప్పినా హరీష్​ఫలితాలపై ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోవడం దారుణమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు హరీష్​అనే టెన్త్ విద్యార్ధి జీవితాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి 10 వ తరగతి లీకేజ్ అయిందంటూ బీజేపీ, బీఆర్ఎస్‌లు కొత్త దందాని తెరపైకి తీసుకువచ్చాయన్నారు.

హరీష్ తప్పుచేయకపోయినా.. డిబార్ చేశారన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోర్టు మెట్లు ఎక్కి హరీష్‌పై డిబార్ ఎత్తివేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఓట్ల కోసం బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. హరీష్​ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రిని కోరుతున్నామన్నారు. రెండు రోజుల్లో ఇంటర్ అడ్మిషన్స్ పూర్తవుతాయని, వెంటనే ఫలితాలను ప్రకటించాలన్నారు.


Similar News