ఆసుపత్రికే కాదండోయ్.. బావి దగ్గరకు వెళ్లినా జబ్బులు ఇట్టే మాయం

దిశ, వెబ్‌డెస్క్ : పెద్దవాళ్లు ఇప్పటికీ ఎదైనా గాయం అయితే ఆకు పసరు లాంటివి పెడుతూ ఉంటారు.

Update: 2022-04-27 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పెద్దవాళ్లు ఇప్పటికీ ఎదైనా గాయం అయితే ఆకు పసరు లాంటివి పెడుతూ ఉంటారు. ఏదైనా మంచి జరగాలంటే ఆ గుడికి వెళ్తే బాగవుతుంది, ఇక పాము కరిసినా ఆ ఊరికి వెళ్లి బావి నీరు తాగితే విషం ఎక్కదని పెద్దవాళ్లు చెప్పుకుంటుంటే మనం విటాం. అయితే చర్మ వ్యాధులకు ఆసుపత్రికే కాదండోయ్.. బావి దగ్గరకు వెళ్లినా జబ్బులు ఇట్టే మాయమవుతాయంట. అదేంటి చర్మ వ్యాధులకు బావి వద్దకు వెళ్లాలి అనుకుంటున్నారా.. ? అయితే మీరే చూడండి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని మల్యాల అనే గ్రామంలో ఉన్న బావి వద్దకు వెళ్తే చర్మ సమస్యలు ఇట్టే మాయమవుతాయంట. అయితే గతంలో ఆగ్రామానికి ఒక స్వామీజి వచ్చాడంట. ఆ సమయంలో ఓ వ్యక్తి చుండెలుక కరవడంతో ఆయన స్వామిజీని ఆశ్రయించాడంట. దీతో స్వామిజీ వారికి అక్కడే ఒక గుంత తవ్వి రాగి శంబులో నీటిని ఉంచి ఏడువారాలు స్నానం చేయాలని చెప్పాడంట. అప్పటి నుంచి చర్మ సమస్యలు తగ్గిపోయాయంట. రాను రాను దాన్ని భావిగా తవ్వారంట. అప్పటి నుంచి ఆ బావి చర్మ సమస్యలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. చర్మం, దుద్దర్లు లాంటి సమస్యలు ఉన్నవారు ఆ బావి నీరు తాగి సమస్యలకు చెక్ పెడుతున్నారంట. మనుషులకు కాకుండా జంతువులకు కూడా ఆ నీరు మంచి ఔషదంలా పనిచేస్తాయని టాక్.

ఈ నీటిని ఎలా ఉపయోగిస్తే ఫలితం..

చుండెలుక బావి నీటిని ఏడు వారాలపాటు స్నానం చేయాలి, ఏడు గుట్కల నీరు ఏడమ చేతితో తాగడం లాంటివి చేయడం వలన చర్మసమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Tags:    

Similar News