అధికారంలోకి రాగానే గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం : రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గండిపల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించారు.
దిశ, కొహెడ : హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర హుస్నాబాద్ నియోజకవర్గానికి చేరిన సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గండిపల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో 70% పూర్తి అయిన ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్యాకేజ్‌లు ఇవ్వకుండా నిర్వాసితుల గోసకు కారణం అవుతున్నారన్నారు.
పరిహారం అడిగితే నిర్వాసితులను జైలుకు పంపుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గండిపల్లి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ సికింద్రాబాద్ మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుముకుంట నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.