విద్యా వైద్యంపై ఫోకస్ పెట్టాం : ఎంఎల్ఏ వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టిందని ఎంఎల్ఏ వివేక్ వెంకటస్వామి అన్నారు.

Update: 2024-08-09 10:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టిందని ఎంఎల్ఏ వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం చెన్నూర్ క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేదవాళ్ళను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు 1 లక్ష, 50 వేల లోపు ఉన్నవారి ఋణాలను మాఫీ చేశామని, ఆగస్ట్ 15న 2 లక్షల లోపు ఋణాలను కూడ మాఫీ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఋణమాఫీపై ఎవరూ ఆందోళన చెందవద్దని, ఋణమాఫీ జరగని వారి వివరాలు క్యాంప్ కార్యాలయంలో అందజేస్తే వారికి కూడ త్వరలోనే ఋణమాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా వివేక్ హామీ ఇచ్చారు. అలాగే ఆరుహామీలలో ఒక్కొక్కటిగా అన్నిటినీ తమ ప్రభుత్వం నెరవేర్చుతుందని తెలిపారు. చెన్నూరులో జరిగే ఇసుక అక్రమ రవాణాపై స్పందించిన వివేక్.. అలాంటి వారిని కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపట్ల రెవెన్యూ అధికారులు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇటీవల అక్రమాలకు పాల్పడిన ఐదుగరు సిబ్బందిని తొలగించామని, ఇసుక క్వారీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.  


Similar News