గ్రామీణ ప్రాంతాలకు ఐటీ విస్తరించాం : KTR
గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమ విస్తరించామని మంత్రి కేటీఆర్ అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమ విస్తరించామని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్ మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రంపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్ట్ నాలుగేళ్లలో నిర్మించామన్నారు. లక్ష కిలోమీటర్ల పైప్ లైన్ వేసి కోటి ఇళ్లకు మంచి నీరు అందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18వేల కోట్లకు పెరిగాయన్నారు.
ఇవి కూడా చదవండి: తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ప్రకటనలకే పరిమితమా?